యువ‌త దేశ అభివృద్ధిలో భాగ‌స్వాములు కావాలి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 18 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): యువత ప్ర‌ధాని మోదీ స్ఫూర్తితో దేశ అభివృద్ధిలో , అభ్యున్నతిలో భాగస్వామ్యం కావాల‌ని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు అన్నారు. సంవత్సరంలో రెండు సార్లు రాక్తదానం చేయడం ఆరోగ్యానికి మేల‌ని ఎమ్మెల్సీ అంజిరెడ్డి సూచించారు. దేశం కోసం , దేశ ప్రజలకోసం ఎన్నో సంస్కరణలు, సంక్షేమ పథకాలు తీసుకొచ్చి వికసిత భారత్ లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తున్న మహోన్నత వ్యక్తి ప్రధాని మోదీ అని కొనియాడారు. మనం ఇచ్చే రక్తం వల్ల కొన్ని ప్రాణాలు కాపాడితే అదే మన ప్రధాని మోదీకి ఇచ్చే గొప్ప గిఫ్ట్ అని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, శేరిలింగంపల్లి అసెంబ్లీ కంటేస్టెడ్ ఎమ్మెల్యే, ఇంఛార్జి రవికుమార్ యాదవ్ అన్నారు.

తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యాలయం పిలుపుమేరకు, ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గ కంటెస్టెడ్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో మియాపూర్ డివిజన్ ఆర్.బి.ఆర్ కాంప్లెక్స్ వద్ద ర‌క్త‌దానం శిబిరం ఏర్పాటు చేశారు. ఇందులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. నియోజకవర్గ సీనియర్ నాయకులు, రంగారెడ్డి జిల్లా ఆఫీస్ బేరర్స్, సేవా పక్షం కన్వీనర్స్, జిల్లా ప్రధాన కార్యదర్శి , డివిజన్ అధ్యక్షులు, కంటెస్టెంట్ కార్పొరేటర్, మహిళా మోర్చా యువమోర్చా , ఎస్టి మోర్చా నాయకులు , వివిధ కాలనీవాసులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు మాట్లాడుతూ సేవాపక్షంలో భాగంగా పెద్దఎత్తున రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన నియోజకవర్గ నాయకులను అభినందించారు. మోదీ గొప్ప నాయకుడు మాత్రమే కాదు దేశ ప్రజలందరికీ ఒక మార్గదర్శి అని, దేశ ప్రజల కోసం ఎన్నో సంస్కరణలు, సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. ఈ సందర్భంగా రక్తదానం చేస్తున్న యువతను అభినందించారు. ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం చాలా మంచి విషయం అని అన్నారు. నియోజకవర్గ ఇంచార్జి రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం చాలా మంచి విషయమని తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here