శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 15 (నమస్తే శేరిలింగంపల్లి): బషీర్ గాగ్ ప్రెస్ క్లబ్ లో నాగుల శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్బంగా బేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ భారత దేశంతో పాటు తెలంగాణలో కూడా అవినీతి, నిరుద్యోగ సమస్య, స్వార్థం, గుండాయిజం రాజ్యమేలుతున్నాయని అన్నారు. ప్రజలు అనేక అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని, ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ ముఖ్య విభాగాలైన పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, మిగతా కొన్ని డిపార్ట్మెంట్లో అవినీతి, లంచగొండితనం విపరీతంగా పెరిగి పోయిందన్నారు. సామాన్యులు, పేద ప్రజలు బతకడమే కష్టమైపోయిందని అన్నారు. లోకల్ బాడీ ఎలక్షన్లలో నిజాయితీపరులైన సర్పంచులు, వార్డ్ మెంబర్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మండల అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, నిజాయితీపరులను ఎన్నుకొని స్వార్థపరులను సమూలంగా పక్కనపెట్టి ఈ ఎన్నికల్లో మంచివారిని నిజాయితీపరులను నిస్వార్ధంగా సేవ చేసే వారిని మనమే ఎన్నుకుందామని అన్నారు.

ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో బి జి ఆర్ నారగోని గౌడ్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్య నారాయణ, బొట్టు ప్రభాకర్, చీమల జగదీష్ యాదవ్, అరుణ్ కుమార్, వెంకట్ ఇంద్ర పాళీ, పోగాల ప్రతాప్ కుమార్, బి సంపత్ కుమార్, బిఎస్ఎన్ఎల్ శ్రీనివాస్ యాదవ్, కొత్త హరి ప్రసాద్, హైటెక్ సిటీ శేరిలింగంపల్లి ఉపాధ్యక్షుడు సత్యనారాయణ యాదవ్, తెలంగాణ పొలిటిషన్ జేఏసీ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్ యాదవ్, జెఎసి సభ్యులు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.





