శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 15 (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్ పేట గ్రామస్తులు, హనుమాన్ యూత్ సభ్యులు, ముదిరాజ్ సంఘ సభ్యులు, ప్రకాష్ నగర్, వినాయక్ నగర్ అసోసియేషన్ సభ్యుల అభ్యర్థన మేరకు వాసవి లేక్ సిటీ యాజమాన్యం వెంటనే స్పందించి కొత్తకుంట చెరువు కట్టపై సుందరమైన గార్డెన్ ను, వివిధ రకాల పూలు, పండ్ల మొక్కలను కూడా నాటిస్తామని తెలియజేశారు. ముందుగా ఇచ్చిన మాట ప్రకారం కట్టమైసమ్మ మందిరం పునర్నిర్మాణానికి చేయూతనిస్తామని తెలిపారు. బతుకమ్మలు వేయడానికి బతుకమ్మ పాండ్ కూడా నిర్మించి ఇస్తామని తెలిపారు. కొత్తకుంట వాకర్స్ క్లబ్ మెంబెర్స్ అభ్యర్థన మేరకు ఓపెన్ జిమ్ ఎక్విప్మెంట్స్, వాకర్స్ కోసం వాష్ రూమ్స్ నిర్మించి ఇచ్చే విషయంలో యాజమాన్యం సానుకూలంగా స్పందించారు అని స్థానిక నాయకుడు దాత్రీనాథ్ గౌడ్ తెలిపారు.






