శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 5 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ న్యూ కాలనీ కాలాపురం బస్తీలోని బంజారా యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయక మండపంలో నిర్వహించిన వేలంపాటలో గణేష్ లడ్డూను రూ. 3,05,000 కు మునావత్ తారాబాయి లక్ష్మణ్ లడ్డూని కైవసం చేసుకున్నారు. లక్కీ డ్రాలో గణేషుడి లడ్డు ప్రసాదాన్ని గుగులోత్ లక్ష్మీబాయి కైవసం చేసుకున్నారు.






