వినాయ‌క మండ‌పాల్లో పూజ‌లు చేసిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 5 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని సాయి నగర్ వెస్ట్, తులసి నగర్ ఫేజ్‌ 1, తులసి నగర్ ఫేజ్ 2, ఆల్విన్ కాలనీ నల్లపోచమ్మ దేవాలయం, కాకతీయ నగర్, వెంకటపాపయ్య నగర్, ఆల్విన్ కాలనీ ఫేజ్‌ 2, చంద్రమ్మ కాలనీ, మరెమ్మ నగర్, మహాత్మా గాంధీ నగర్, జన్మభూమి కాలనీ, సుభాష్ చంద్రబోస్ కాలనీ, ఇంద్రాహిల్స్, ఆశా నగర్, తులసివనం, విజయ నగర్ కాలనీలలో కాలనీ వాసుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయక మండపాలను కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ సందర్శించి గణేష్ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం వినాయక కమిటీ సభ్యులు ఏర్పాటుచేసిన అన్న సమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించి భక్తులకు అన్న ప్రసాదాలు వడ్డించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు , భక్తులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here