శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 3 (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని హుడా కాలనీలో మంజీరా రోడ్ కు ఆనుకుని ఉన్న ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ సమీపంలో దాదాపు 200 గజాల పార్క్ స్థలం కబ్జాకు గురైందని, ఆ స్థలాన్ని రక్షించాలని కోరుతూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ కి శేరిలింగంపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ ఉపాధ్యక్షుడు మిద్దెల మల్లారెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ ఆ స్థలం విలువ దాదాపుగా రూ. 4 కోట్ల వరకు ఉంటుందన్నారు. స్థలం కబ్జాపై ప్రజావాణిలో దాదాపుగా పదిసార్లు ఫిర్యాదు చేశానని తెలిపారు. అయినప్పటికీ ఇంతవరకు జిహెచ్ఎంసి పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు పరిశీలించ లేదన్నారు. అందులో భాగంగానే మళ్లీ ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కాగా హైడ్రా అధికారులు సానుకూలంగా స్పందించారని, సీఐ రాజశేఖర్ కిఈ విషయాన్ని అప్పగించారని తెలిపారు. స్థలం కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని వారు తెలిపారని అన్నారు. పార్కు స్థలాలను కబ్జాలకు గురి కాకుండా రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.






