శేరిలింగంపల్లి, ఆగస్టు 30 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని RDB కోకనట్ గ్రో అపార్ట్మెంట్స్, శ్రీల గార్డెన్, మయూరి నగర్ కాలనీ లోని ARK టవర్స్ అపార్ట్మెంట్స్, మయూరి నగర్ ధ్యాన మారుతి దేవాలయం, అరబిందో కాలనీ, ఏ ఎస్ రాజు నగర్, మిర్ర పంచ జన్య అపార్ట్మెంట్స్, జయప్రకాష్ నారాయణ నగర్ కాలనీ, జయప్రకాష్ నారాయణ నగర్ మెయిన్ రోడ్డు, సాయిరాం నగర్ కాలనీ, కృషినగర్ A బ్లాక్, B బ్లాక్, RBR అపార్ట్మెంట్స్ రెండవ బ్లాక్, శ్రీ లక్ష్మీ నగర్ కాలనీలలో ఏర్పాటు చేసిన వినాయకులను కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని సందర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్బంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతనను అలవాటు చేసుకోవాలని అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలందరిపై గణనాథుడి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు , భక్తులు తదితరులు పాల్గొన్నారు.






