విఘ్నాల‌ను తొల‌గించి విజ‌యాల‌ను ద‌రిచేర్చేవాడు వినాయ‌కుడు: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, ఆగ‌స్టు 29 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని గాంధీ హైట్స్ లో వినాయక చవితి న‌వ‌రాత్రి ఉత్స‌వాల్లో భాగంగా ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద నిర్వహించిన పూజ కార్యక్రమంలో PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్బంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ జీవితంలో ఎదురయ్యే విఘ్నాల‌ను తొలగించి విజయాలను దరిచేర్చేవాడు వినాయకుడు అని అందుకే ఆయన‌ను విఘ్నేశ్వరుడు అని అంటార‌ని తెలిపారు. ఎంతోమంది దేవుళ్లు ఉన్నప్పటికీ మొదట పూజలు అందుకునేది ఆయనే కాబట్టి ఆదిదేవుడుగా కొలుస్తారు అని అన్నారు.  ఏనుగు తల, మనిషి శరీరం కలిగి ఉండి ఒకే దంతం కలిగి ఉండటంచేత ఏకదంతుడుగా కీర్తించబడుతున్నాడ‌ని అన్నారు. వినాయ‌క చ‌వితి ఉత్స‌వాల‌ను ప్ర‌జ‌లు భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో జ‌రుపుకోవాల‌ని, ఎలాంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా నిర్వాహ‌కులు చూడాల‌ని అన్నారు. ఈ కార్యక్రమంలో గాంధీ హైట్స్ అపార్ట్మెంట్ వాసులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here