శేరిలింగంపల్లి, ఆగస్టు 20 (నమస్తే శేరిలింగంపల్లి): ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహం నాలాలో కొట్టుకువచ్చిన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి లింగంపల్లి మార్కెట్ మీదుగ ప్రవహిస్తున్న నాలాలో ఓ మహిళ మృతదేహాం కొట్టుకువచ్చింది. అది గమనించిన స్థానికులు చందానగర్ పోలీసులకు సమాచారం అందించారు. కొద్దిసేపటికి ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెళికితీశారు.

ఐతే నాలాలో కొట్టుకు వచ్చిన మహిళ ఎవరు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఆమె చేతిపై నర్సమ్మ అనే పచ్చబొట్టు ఉంది. ఆమె వద్ద ఒక పర్స్ లభించగా ఆందులో బంగారు కమ్మలు, ఒక బ్రేస్ లెట్ తో పాటు ఒక నెంబర్ ను గుర్తించినట్టు సమాచారం. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి గాంధీ తరలించారు.






