శేరిలింగంపల్లి, ఆగస్టు 20 (నమస్తే శేరిలింగంపల్లి): మెగాస్టార్ చిరంజీవి 70వ జన్మదినం సందర్భంగా సరస్వతి విద్యా మందిర్ లో విద్యార్థులకు నోట్ బుక్స్, జామెట్రీ బాక్స్, క్రికెట్ బ్యాట్లు, బ్యాట్మింటన్ బ్యాట్లు, వికెట్స్, బాల్స్, వాలీబాల్ తదితర క్రీడా సామాగ్రిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా నాయకుడు ప్రీతం, సత్య స్పోర్ట్స్ అధినేత దంగేటి సత్యనారాయణ, విద్యా భవన్ బోర్డ్ మెంబర్ రామచంద్ర రెడ్డి, చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ ఫౌండర్ మెంబర్స్ సత్తి అప్పారావు, రమణ, ప్రసాద్, ఫ్యాన్స్ అధ్యక్షుడు దొరబాబు, జనరల్ సెక్రెటరీ రాంబాబు, బిర్లా శ్రావణ్, మహేష్, జివి నారాయణ, లోక శ్రీ సోమేశ్వరావు, శంకర్, చలం హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో విష్ణుమూర్తి, తిక్కిరెడ్డి, ఆర్గనైజేషన్ ఆల్ ఇండియా చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ ఇస్నాపూర్ టు చందానగర్ గాలి అనిల్ కుమార్ పాల్గొన్నారు.






