భారతి నగర్ డివిజన్ పరిధిలో ఘ‌నంగా బోనాల ఉత్స‌వాలు

శేరిలింగంప‌ల్లి, ఆగ‌స్టు 20 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): తెలంగాణ రాష్ట్ర సంస్కృతి , సంప్రదాయాలకు ప్రతీక అయిన బోనాల పర్వదినం సందర్భంగా భారతి నగర్ డివిజన్ పరిధిలోని MIG కాలనీలో ఉన్న శ్రీ శ్రీ శ్రీ లలితా పోచమ్మ దేవాలయం బోనాల ఉత్సవాలలో భాగంగా మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫలహారం బండి ఊరేగింపు కార్యక్రమంలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డితో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ అమ్మ వారి దీవెనలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని అమ్మవారిని వేడుకుంటున్నాను అని అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని వాడవాడలా బోనాల జాతర వేడుకలను ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకోవలనే ఉద్దేశ్యంతో నియోజకవర్గంలోని ప్రతి ఆల‌యానికి బోనాల నిధులు మంజూరయ్యేలా కృషి చేశానని తెలిపారు. బోనాలు అంగరంగ వైభవంగా జరుపుకునేలా  బోనాలు నిర్వహించుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరుచేయడం పట్ల హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రవీందర్ రావు, ఆదర్శ్ రెడ్డి, సత్యనారాయణ, కొండల్ రెడ్డి, మిరియాల ప్రీతమ్, సంపత్, రాకేష్ రెడ్డి, పవన్ గౌడ్, నాయకులు, కార్యకర్తలు, మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here