భారీ ఎత్తున చేరిన వ‌ర‌ద నీరు.. తొల‌గించిన ట్రాఫిక్ పోలీసులు..

శేరిలింగంప‌ల్లి, ఆగ‌స్టు 17 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో తాజాగా కురుస్తున్న భారీ వ‌ర్షాల‌కు గాను ప‌లు చోట్ల ర‌హ‌దారుల‌పై భారీ ఎత్తున వ‌ర‌ద నీరు చేరింది. దీంతో వాహ‌న‌దారుల రాక‌పోక‌ల‌కు తీవ్ర ఇబ్బంది క‌లుగుతోంది. ఈ క్ర‌మంలోనే చందాన‌గ‌ర్ నుంచి మియాపూర్‌కు వెళ్లే ర‌హ‌దారిలో సెవెన్ హిల్స్ రెస్టారెంట్ వ‌ద్ద భారీ ఎత్తున వ‌ర‌ద నీరు చేర‌గా మియాపూర్ ట్రాఫిక్ పోలీసులు స్పందించి వ‌ర‌ద నీటిని తొల‌గించారు. ఈ మేర‌కు పోలీసులు వ‌ర‌ద నీటి తొల‌గింపు ప్ర‌క్రియ‌ను ద‌గ్గ‌రుండి ప‌ర్య‌వేక్షించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here