శేరిలింగంపల్లి, ఆగస్టు 15 (నమస్తే శేరిలింగంపల్లి): ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని వెంకటపాపయ్య నగర్ లో సీసీ రోడ్డు నిర్మాణం పెండింగ్లో ఉందని కాలనీ వాసులు డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దృష్టికి తీసుకురాగా కార్పొరేటర్ కాలనీలో పర్యటించి పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ సీసీ రోడ్డు నిర్మాణం కోసం ప్రతిపాదనలను పంపించామని, నిధులు మంజూరైన వెంటనే సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించి నాణ్యతా ప్రమాణాల విషయంలో రాజీ పడకుండా యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సమ్మారెడ్డి, కాలనీ అధ్యక్షుడు జనార్ధన్ రావు, పోశెట్టిగౌడ్, రమేష్, నాగేష్ తదితరులు పాల్గొన్నారు.






