శేరిలింగంపల్లి, ఆగస్టు 13 (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని యూత్ కాలనీ కి చెందిన శ్రీ రాములు వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా CMRF ద్వారా మంజూరైన రూ.25,000 ఆర్థిక సహాయానికి సంబంధించిన CMRF చెక్కును బాధిత కుటుంబానికి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ అందజేశారు. ఈ సందర్భంగా వైద్య చికిత్సకి సహకారం అందించిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తున్నామని బాధిత కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.






