శేరిలింగంపల్లి, ఆగస్టు 12 (నమస్తే శేరిలింగంపల్లి): వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వెంకటేశ్వర నగర్ కాలనీకి చెందిన మోడలులం ఆంజనేయులు వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా CMRF ద్వారా మంజూరైన రూ.25వేల ఆర్థిక సహాయానికి సంబంధించిన CMRF చెక్కును బాధిత కుటుంబానికి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ అందచేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పురెందర్ రెడ్డి, చంద్రమోహన్ సాగర్, శివ సాగర్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.






