బీపీ మండల్ జయంతి ఉత్సవ కార్యక్రమంలోఎంబీసీ చైర్మన్ జేరుపాటి జైపాల్

శేరిలింగంప‌ల్లి, ఆగ‌స్టు 11 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): తెలంగాణ రాష్ట్ర బీసీ వేదిక అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో బిపి మండల్ జయంతి వారోత్సవాల‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు. మండల్ కమిషన్ చైర్మన్ బిందేశ్వర్ ప్రసాద్ మండల్ జయంతి ఉత్సవాల సందర్భంగా బేరి రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకుడు, సీనియర్ ఎంబీసీ చైర్మన్ జైపాల్ ద్వారా బీపీ మండల్ చిత్ర పటానికి ఘనంగా నివాళులు అర్పించారు. బిపి మండల్ జయంతి వారో త్సవాలు జరుపుకుంటున్న క్రమంలో లింగంపల్లి బీసీ కార్యాలయంలో ఎంబిసి చైర్మన్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైపాల్ బి పి మండల్ చిత్రపటానికి పూలమాలల‌తో ఘ‌నంగా నివాళులు అర్పించారు. ఈ సంద‌ర్భంగా భేరి రామ‌చంద‌ర్ యాద‌వ్ మాట్లాడుతూ బీపీ మండల్ ఆశయాలను సాధిస్తామ‌ని అన్నారు. బీపీ మండల్ 40 సిఫారసులను సరైన మార్గం ప్రకారం పార్లమెంట్ ద్వారా అమలు చేయాల‌న్నారు. రాజకీయ, ఆర్థిక, సామాజిక న్యాయం కోసం రాష్ట్ర , కేంద్ర ప్రభుత్వాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీసీ ఫెడరేషన్ అధ్యక్షుడు ఆర్. కె. సాయన్న ముదిరాజ్, శేరిలింగంపల్లి సంక్షేమ సంఘం అధ్యక్షుడు, అడ్వకేట్ రమేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శి బి కృష్ణ, ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు, బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు నర్సింగ్ ముదిరాజ్, శ్రీరామ్, సైదులు, శేరిలింగంపల్లి మహిళా అధ్యక్షురాలు లలిత రాణి, కొండాపూర్ డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి, ఎంఐజి అధ్యక్షురాలు సంగమ్మ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here