శేరిలింగంపల్లి, ఆగస్టు 3 (నమస్తే శేరిలింగంపల్లి): PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ నివాసానికి వచ్చిన NATS ( నార్త్ అమెరికా తెలుగు సొసైటీ) నూతన అధ్యక్షుడు మందడి శ్రీహరిని కార్పొరేటర్లు నార్నె శ్రీనివాస రావు, ఉప్పలపాటి శ్రీకాంత్, కమ్మవారి సేవా సంఘాల సమాఖ్య తెలంగాణ సభ్యులతో కలిసి కమ్మవారి సేవా సంఘాల సమాఖ్య తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, PAC చైర్మన్ ఆరెకపూడిగాంధీ శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కమ్మవారి సేవా సంఘాల సమాఖ్య తెలంగాణ సభ్యులు అడుసుమిల్లి వెంకటేశ్వరరావు, చాపరాల శ్రీనివాస్ దాసు, నాగభూషణం, తాళ్లూరు చంద్రమౌళి, పాండురంగారావు, ప్రసాద్, కిలారు మనోహర్, కోనేరు ప్రసాద్, సైదేశ్వర్ రావు, రాధాకృష్ణ, తిలక్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.






