ప్ర‌తి ఒక్క‌రు ప‌రిస‌రాల‌ను ప‌రిశుభ్రంగా ఉంచుకోవాలి: కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

శేరిలింగంప‌ల్లి, ఆగ‌స్టు 1 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): వర్షాకాల ప్రత్యేకపారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా డిప్యూటీ కమిషనర్ శశిరేఖ, పట్టణ ప్రణాళిక విభాగం ఏసిపి నాగిరెడ్డి, జిహెచ్ఎంసి ఆయా శాఖల సంబంధిత అధికారులతో కలిసి మియాపూర్ డివిజన్ పరిధిలోని అమన్ కాలనీ, చిరంజీవి నగర్, ప్రగతి ఎన్‌క్లేవ్ కాలనీలలో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ మాట్లాడుతూ వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పారిశుద్ధ్య చర్యల స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా ప్రజలను చైతన్య పరుస్తూ తడి, పొడి చెత్తను వేర్వేరుగా నిల్వ చేయాలని, వర్షపునీరు ఇంటి పరిసరాల్లో నిలువ ఉండకుండా చూడాలని సూచించారు. కాలనీలలో మౌలిక వసతులు కల్పించడమే ప్రధాన ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి అధికారులు డిఈ దుర్గాప్రసాద్, శానిటేషన్ సూపర్వైజర్ శ్రీనివాస్, ఎంటమాలజి ఏఈ చిన్న రమావత్, శానిటేషన్ ఎస్ఆర్పి మహేష్, స్థానిక నాయకులు, సుప్రజ, మహమ్మద్ ఖాజా, అప్రోజ్, జహంగీర్, రామ్ ప్రభు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here