మారబోయిన భౌమిక్ యాదవ్ కు ఘన స్వాగతం

శేరిలింగంప‌ల్లి, జూలై 31 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): 5వ జాతీయ సబ్-జూనియర్ గ్రాప్లింగ్ ఛాంపియన్‌షిప్ 2025లో స్వర్ణ, రజత పతకాలు సాధించిన భౌమిక్‌కు శేరిలింగంపల్లిలో ఘన స్వాగతం ల‌భించింది. చత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్‌లో జరిగిన 5వ జాతీయ సబ్-జూనియర్, కేడెట్ గ్రాప్లింగ్ (రెస్లింగ్) ఛాంపియన్‌షిప్ 2025లో స్వర్ణ, రజత పతకాలు సాధించిన మారబోయిన భౌమిక్ యాదవ్ కు శేరిలింగంపల్లిలోని మసీదు బండ ప్రాంతంలో ఘన స్వాగతం ప‌లికారు. ఈ సంద‌ర్భంగా మ‌సీదు బండ సర్కిల్ నుండి భౌమిక్ నివాసం వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రజలు రోడ్‌లో నిలిచి భౌమిక్‌కు అభినందనలు తెలిపారు. ఈ సంద‌ర్భంగా భౌమిక్‌ను ప‌లువురు ఘ‌నంగా అభినందించారు. ఈ సంద‌ర్భంగా తండ్రి, గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ యూత్ ఎక్స్-వైస్ ప్రెసిడెంట్ మారబోయిన రవి యాదవ్ మాట్లాడుతూ త‌న కుమారుడు భౌమిక్ ఈ ఘ‌న‌త సాధించినందుకు త‌న‌కు ఎంత‌గానో గ‌ర్వంగా ఉంద‌న్నారు. ఈ విజ‌యాన్ని త‌న కుటుంబంతోపాటు శేరిలింగంప‌ల్లి ప్ర‌జ‌ల‌కు అంకితం చేస్తున్న‌ట్లు తెలిపారు. భౌమిక్ ఇలాంటి మ‌రెన్నో ఘ‌న‌త‌ల‌ను సాధించాల‌ని కోరుకుంటున్నాన‌ని అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో స్థానిక నాయ‌కులు, ప‌లు కాల‌నీల వాసులు, క్రీడాకారులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here