ఓబీసీ బిల్లును పార్లమెంట్ లో ఆమోదించాలి: కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

శేరిలింగంపల్లి, జూలై 24 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు శుక్రవారం జర‌గ‌నున్న ఛలో ఢిల్లీ భాగీదారీ న్యాయ సమ్మేళనంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ OBC విభాగం ఆధ్వ‌ర్యంలో ఢిల్లీలో నిర్వ‌హించిన‌ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ , ఇతర నేతలు, నాయకులతో కలిసి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా నాగేంద‌ర్ యాద‌వ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన కుల సర్వే విధివిధానాలు, కుల గణన సర్వే శాస్త్రీయబద్ధంగా చేసిన తీరుపై సమీక్షా సమావేశం నిర్వ‌హించామ‌న్నారు. నేటి పరిస్థితుల్లో సామాజిక, విద్య, ఆర్థికంగా OBCల అభివృద్ధి కోసం ఉద్యమం అవసరమని పేర్కొన్నారు. దీనికోసం రాష్ట్రం పంపిన బిల్లులు ఆమోదానికి కేంద్రంతో పోరాడాల్సిన అవసరం ఉందని అన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here