శేరిలింగంపల్లి, జూలై 7 (నమస్తే శేరిలింగంపల్లి): ఎంఆర్పిఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవం, మంద కృష్ణ మాదిగ పుట్టిన రోజు సందర్భంగా శేరిలింగంపల్లి కొండాపూర్ డివిజన్ సిద్దిక్ నగర్ లో అంబేద్కర్ సర్కిల్లో డివిజన్ నాయకుడు జగపతి అంజయ్య మాదిగ ఆధ్వర్యంలో జాతీయ సీనియర్ నాయకులు కుమ్మరి సత్యనారాయణ మాదిగ, తిరుపతి రెడ్డి, భాస్కర్ ఆర్య వైశ్య, యాదయ్య గౌడ్, సాగర్ చౌదరి, రవీందర్ రెడ్డి, రాము యాదవ్, యాదగిరి యాదవ్, నందు మాదిగ, నయిమ్, గణపతి, దిలీప్, వరలక్ష్మి మాదిగ, సరోజ చిందు కులం, శేఖర్ చిందు కులం, రాము మాదిగ, బసవరాజు మాదిగ, సడర్ సాయి, శేఖర్ మాదిగ, దాసు మాదిగ, నర్సింగ్ మాదిగ, కృష్ణ మాదిగ, రఘులు కలిసి పెద్ద ఎత్తున జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం మంద కృష్ణ మాదిగ పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎం ఆర్ పి ఎస్ సీనియర్ జాతీయ నాయకుడు కుమ్మరి సత్యనారాయణ మాదిగ మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ 30 ఏండ్ల పోరాటాన్ని వాస్తవాలను ఎమ్మార్పీఎస్ ఉద్యమ ఫలితాలను ఆరోగ్య శ్రీ పథకం, ఎలా వచ్చింది, వృద్ధులు, వితంతువులు, వికలాంగులు పింఛన్లు ఎలా వచ్చాయి, రేషన్ బియ్యం పెంపు, ఎస్సీ, ఎస్టీ ప్రమోషన్ లలో రిజర్వేషన్లు పెంపు, ఆర్ టీ సి సంస్థను కాపాడుకోవడం వంటి ఎన్నో విషయాలను తెలియజేశారు. రాబోయే రోజుల్లో సామాజిక ఉద్యమానికి అందరూ తోడు అండగా ఉండాలని ఐత రమేష్ మాదిగ, కోడిచెర్ల ప్రేమ్ కుమార్ మాదిగలు పిలుపు ఇచ్చారు.






