శేరిలింగంపల్లి, ఏప్రిల్ 7 (నమస్తే శేరిలింగంపల్లి): భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని చంద్ర నాయక్ తండాలో ఘనంగా నిర్వహించారు. స్థానిక నాయకులు సుమన్ నాయక్, శ్రీనివాస్ నాయక్ ల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కంటెస్టెడ్ కార్పొరేటర్ గంగల రాధాకృష్ణ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై బీజేపీ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా గంగల రాధాకృష్ణ యాదవ్ మాట్లాడుతూ నవభారత నిర్మాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో అఖండ భారతం వైపు విజయ యాత్ర కొనసాగిస్తున్నామని తెలిపారు. బీజేపీ శ్రేణులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మహేందర్ యాదవ్, బాలు నాయక్, గురు యాదవ్, నరేష్ రెడ్డి, ఈశ్వర్, చింటూ, శివ, మల్లికార్జున్ పాల్గొన్నారు.