శేరిలింగంపల్లి, ఏప్రిల్ 6 (నమస్తే శేరిలింగంపల్లి): విద్యను అభ్యసిస్తూ ఫీజ్ చెల్లింపు విషయంలో ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు వి. భావన ( 6 వ తరగతి), వి సాయి నిఖిల్ ( 4 వ తరగతి)కు పలువురు చేయూతను అందించారు. స్కూల్ ఫీజ్ చెల్లింపు విషయంలో ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకున్న లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ హోప్ వ్యవస్థాపక అధ్యక్షుడు కొండా విజయ్ కుమార్ రూ 20 వేల చెక్కును సీతాఫల్ మండి కార్పొరేటర్ హేమ శ్యామల చేతుల మీదుగా అందచేశారు. పేద వారికి సహాయం అందచేయడంలో లయన్స్ క్లబ్ ఎప్పడు ముందు వుంటుందని తెలిపారు. ఈ సదర్బంగా లయన్స్ సభ్యులను కార్పొరేటర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ రాజ్ ముదిరాజ్, మధు సుధన్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, రాజశేఖర్, మారం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.