శేరిలింగంపల్లి, ఏప్రిల్ 4 (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రేమ్ నగర్ కాలనీకి చెందిన సునీల్ కుమార్ వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా CMRF ద్వారా మంజూరైన రూ.50,000, హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని హఫీజ్ పేట్ కి చెందిన ఈరవల్లి పేరుమరావు వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా CMRF ద్వారా మంజూరైన రూ.30,000 ఆర్థిక సహాయానికి సంబంధించిన CMRF చెక్కులను కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి బాధిత కుటుంబాలకి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సంజీవ రెడ్డి , నాయినేనీ చంద్రకాంత్ రావు, పాతూరి వెంకట్ రావు తదితరులు పాల్గొన్నారు.






