గురువారం హఫీజ్ పేట లో కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశం

గాంధీభవన్ లో పిసిసి నాయకులతో సమావేశమైన శేరిలింగంపల్లి కాంగ్రెస్ నాయకులు

హాజరు కానున్న రాష్ట్ర నేతలు… పార్టీ అభ్యర్థుల ప్రకటన 

హఫీజ్ పేట(నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ లో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో గురువారం నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశాన్ని హఫీజ్ పేట లోని ఫ్రెండ్స్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించనున్నట్లు ఆ పార్టీ యూత్ నాయకుడు మహిపాల్ యాదవ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి రాష్ట్ర నాయకులు పొన్నం ప్రభాకర్, విశ్వేశ్వర్ రెడ్డి, మధుయాష్కీ గౌడ్, వంశీ చందర్ రెడ్డి లు హాజరవనున్నట్లు అయన తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణ, జిహెచ్ఎంసి ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితా విడుదల చేయనున్నట్లు తెలిపారు. నియోజక వర్గ కాంగ్రెస్ నాయకులు, అభిమానులు సమావేశానికి హాజరై విజయవంతం చేయాలనీ ఆయన కోరారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here