ఎమ్మెల్యే గాంధీ, కార్పొరేట‌ర్ గంగాధ‌ర్ రెడ్డికి ధ‌న్య‌వాదాలు: భేరి రామచంద్ర యాదవ్

శేరిలింగంప‌ల్లి, డిసెంబ‌ర్ 16 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ నేతాజీ నగర్ కాలనీలో అభివృద్ధి పనులు సిసి రోడ్లకు నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే ఆరెక‌పూడి గాంధీ, కార్పొరేటర్ గంగాధర్ రెడ్డికి కాలనీ అధ్యక్షుడు భేరి రామచంద్ర యాదవ్ ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఈ సందర్భంగా భేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ సిసి రోడ్లకు 30 లక్షల రూపాయలు మంజూరు చేయగా, యాభై లక్షల రూపాయలు ఇంకా మిగతా సిసి రోడ్లకు మంజూరు చేశారు. తొందర్లోనే నేతాజీ నగర్ కాలనీలో అన్ని వీధుల్లో సిసి రోడ్లు డ్రైనేజీ వర్కులు పూర్తి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింద‌ని అన్నారు. ఎమ్మెల్యేకి, కార్పొరేటర్ కి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ ఉపాధ్యక్షుడు రాయుడు, కె నరసింహ యాదవ్, వెంకన్న, మహిళా అధ్యక్షురాలు రజిత లాల్ రెడ్డి, తెలుగు సుభాష్ ముదిరాజ్, అసోసియేషన్ సభ్యులు , మహిళా సంఘం సభ్యులు పాల్గొన్నారు.

కార్య‌క్ర‌మంలో పాల్గొన్న భేరి రామచంద్ర యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here