శేరిలింగంపల్లి, డిసెంబర్ 5 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ యువజన అధ్యక్షుడు జాకీర్ షరీఫ్ పటేల్ ఎన్నికైన సందర్భంగా PAC చైర్మన్ ఆరెక పూడి గాంధీని తన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్, సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డితో కలిసి షరీఫ్ పటేల్‌ను PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ సన్మానించారు.
ఈ కార్యక్రమంలో నాయకులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, సమ్మారెడ్డి, మారేళ్ల శ్రీనివాస్, శ్రీనివాస్, చైతన్య, రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు ఎండి మోసిన్, మియాపూర్ డివిజన్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు నరేష్ నాయక్, ఆల్విన్ కాలనీ డివిజన్ యువజన అధ్యక్ష నాయకుడు రూబిన్, కొండాపూర్ డివిజన్ యువజన ఉపాధ్యక్షుడు అక్షయ్, లింగంపల్లి డివిజన్ ఉపాధ్యక్షుడు ఇంతియాజ్, అద్నాన్, నావేద్, దత్తు తదితరులు పాల్గొన్నారు.