- కార్పొరేటర్ వి.పూజిత జగదీశ్వర్ గౌడ్
హఫీజ్‌పేట (నమస్తే శేరిలింగంపల్లి): ప్రజల పక్షాన నిలబడే ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అని హఫీజ్‌పేట డివిజన్ కార్పొరేటర్ వి.పూజిత జగదీశ్వర్ గౌడ్ అన్నారు. దీపావళి సందర్భంగా ప్రజలకు ఆస్తి పన్నులో రాయితీని ప్రకటించడంతోపాటు పారిశుద్ధ్య కార్మికులకు రూ.3వేల వేతనం పెంచడంపై హర్షం వ్యక్తం చేస్తూ హఫీజ్‌పేట డివిజన్ వార్డు కార్యాలయంలో స్థానికులు, నాయకులు, మహిళలు, కార్మికులతో కలిసి కార్పొరేటర్లు పూజిత, జగదీశ్వర్ గౌడ్ లు ఆదివారం సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేం చేశారు. ఈ సందర్భంగా వారు సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.