- చందానగర్ తెరాస నాయకులు
చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): ప్రజలకు ఆస్తి పన్నులో 50 శాతం రాయితీని ప్రకటించడంతోపాటు జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు వేతనం పెంచడంపై హర్షం వ్యక్తం చేస్తూ చందానగర్ డివిజన్ పరిధిలోని చందానగర్ గాంధీ విగ్రహం వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి డివిజన్ తెరాస అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పేదల పక్షపాతి అని కొనియాడారు. పేద ప్రజల బాధలను అర్థం చేసుకున్నందునే ఇలాంటి వరాలను అందిస్తున్నారని అన్నారు. తెరాస సీనియర్ నాయకుడు మిరియాల రాఘవరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అశోక్ గౌడ్, మాజీ కౌన్సిలర్లు రవీందర్ రావు, రఘుపతి రెడ్డి, సునీతా రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు ఉరిటి వెంకట్ రావు, జనార్దన్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, మిరియాల ప్రీతమ్, ధనలక్ష్మీ, గురు చరణ్ దూబే, ప్రవీణ్, గోపికృష్ణ, రవీందర్ రెడ్డి, అక్బర్ ఖాన్, అంజాద్ ఖాన్, ఓ వెంకటేష్, దాస్, గిరి,
నారాయణ, జైపాల్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.