పారిశుద్ధ్య కార్మికులకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం

  • కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

శేరిలింగంప‌ల్లి‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): హైదరబాద్ నగర అభివృద్ధికి, శుభ్రంగా ఉంచేందుకు అహర్నిశలు అవిశ్రాంత సేవలందిస్తున్న జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్లవేళలా అండగా నిలుస్తోందని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దీపావళి కానుకగా జీహెచ్ఎంసీ పారిశుద్ద్య కార్మికులకు రూ. 3 వేల వేతనాన్ని పెంచి రూ. 17,500 వేతనాన్ని అందజేసేలా నిర్ణయం తీసుకోవడంతోపాటు సీఎం కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పలు కీలక ప్రకటనలు చేయడం పట్ల ఆదివారం శేరిలింగంపల్లి డివిజన్ వార్డు కార్యాలయం ఆవరణలో జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులతో కలిసి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

సీఎం కేసీఆర్ చిత్ర‌ప‌టానికి పాలాభిషేకం చేస్తున్న కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

పారిశుద్ధ్య కార్మికులను కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఘనంగా శాలువాతో సత్కరించి తన వంతుగా నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు టీఆర్ఎస్ ప్రభుత్వం దీపావళి కానుకగా 2020-21 సంవత్సరానికి జీహెచ్ఎంసీ పరిధిలో రూ. 15 వేల వరకు ఆస్తి పన్ను చెల్లించే గృహ యజమానులకు 50 శాతం రాయితీ, పట్టణాల్లో రూ. 10 వేల పన్ను గల వారికి 50 శాతం రాయితీ కల్పిస్తూ నిర్ణయం తీసుకోవడం పట్ల ప్రజలందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. వానలు ఆగకముందే వరద బాధితుల‌ కోసం తక్షణ‌ సహాయం కింద‌ రూ. 10 వేల ఆర్థిక సహాయం అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దన్నారు. ఇంకా వరద సాయం అందని వారు మీ సేవా కేంద్రాల్లో పేరు, ఇంటి చిరునామా, ఆధార్, మొబైల్ నంబర్,‌ బ్యాంకు అకౌంట్ నంబర్ తో దరఖాస్తు చేసుకోవాలని క్షేత్ర స్థాయిలో అధికారులు వచ్చి పరిశీలించి నేరుగా బ్యాంకు ఖాతాల్లో వేయనున్నట్లు రాగం నాగేందర్ యాదవ్ చెప్పారు.

పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావ‌స‌రాల‌ను అందజేసిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

పారిశుద్ధ్య కార్మికులకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు. సఫాయి కార్మికుల కళ్లల్లో ఆనందం చూడడమే కేసీఆర్, కేటీఆర్ ధ్యేయమన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ డివిజన్ గౌరవ అధ్యక్షుడు దుర్గం వీరేశం గౌడ్, వార్డు మెంబర్ శ్రీకళ, నెహ్రూ నగర్ టీఆర్ఎస్ బస్తీ కమిటీ అధ్యక్షుడు శ్రీకాంత్, గోపీనగర్‌ బస్తీ కమిటీ గౌరవ అధ్యక్షుడు గోపాల్, నాయకులు చంద్రకళ, సుజాత, భాగ్యలక్ష్మీ, కళ్యాణి, రోజా, కుమారి, సౌజన్య, వెంకటేశ్వర్లు, వై. కృష్ణ, వెంకటేశ్వర్, వెంకటేష్ యాదవ్, శానిటేషన్ జవాన్ ఈశ్వర్, ఎస్ఎఫ్ఏ లు వినయ్ కుమార్, భిక్షపతి, కృష్ఞంరాజు, శివకుమార్, నాగేష్, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here