శేరిలింగంపల్లి, నవంబర్ 28 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నవోదయ కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు కాలనీ వాసులతో సమావేశమై అక్కడ ఉన్న సమస్యలు అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవటం జరుగుతుందని పీఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి శాసన సభ్యుడు ఆరెకపూడి గాంధీ, గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా తమ కాలనీలో ఎన్నాళ్లుగానో ఉన్న డ్రైనేజీకి అవుట్ లెట్ సమస్యపై చర్యలు తీసుకోవాలని కోరగా.. వారు తక్షణమే స్పందించి అక్కడే ఉన్న అధికారులకు ఆయా సమస్యల పరిష్కారానికి తీసుకోవలసిన చర్యలపై అధికారులతో చర్చించారు. డ్రైనేజీకి అవుట్ లెట్ ను ఏర్పాటుచేసి, డ్రైనేజీ కాలువలు నిర్మించాలని, అందుకు కావలసిన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ప్రతిపాదనలు సిద్ధం కాగానే నిధులు మంజూరు చేయించి త్వరగా పూర్తి చేసి ప్రజల కష్టాలు తీరుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈ విశాలాక్షి, జలమండలి మేనేజర్ అభిషేక్ రెడ్డి, నరేంద్ర రెడ్డి, నవోదయ కాలని అధ్యక్షుడు వెంకటేశ్వర రావు, నవోదయ కాలనీ వాసులు, సీనియర్ నాయకులు, స్థానిక నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.