శేరిలింగంపల్లి, నవంబర్ 28 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని మియాపూర్ విలేజ్ లో తలెత్తిన డ్రైనేజీ సమస్యను HMWS & SB DGM వెంకటేశ్వర్లు, స్థానిక నాయకులతో కలిసి డివిజన్ కార్పొరేటర్, జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యుడు ఉప్పలపాటి శ్రీకాంత్ పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ.. మియాపూర్ విలేజ్ లో తలెత్తిన భూగర్భ డ్రైనేజి సమస్య ను సివారేజ్ బోర్డు అధికారులతో కలిసి పరిశీలించడం జరిగిందని, డ్రైనేజీ సమస్య పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళుతున్నాం అని, డ్రైనేజీ సమస్యను వెంటనే పరిష్కరించి మియాపూర్ విలేజ్ వాసులకు అందుబాటులోకి తెచ్చే విధంగా పనులు వేగవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ మేనేజర్ సునీత, వర్క్ ఇన్‌స్పెక్టర్ లింగయ్య, స్థానిక నాయకులు మహేందర్ ముదిరాజ్, రామచంద్ర గౌడ్, శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్ ముదిరాజ్, సాయి గౌడ్, సతీష్ చారి తదితరులు పాల్గొన్నారు.