తెరాస పార్టీకి ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు ఎప్పుడూ ఉంటుంది

  • ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): తెరాస పార్టీకి ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు ఎప్పుడూ ఉంటుంద‌ని ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ అన్నారు. శేరిలింగంపల్లి డివిజన్ ప‌రిధిలోని రాఘవేంద్ర కాలనీ సి బ్లాక్ కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు తెరాస నాయకుడు జూపల్లి శ్రీనివాస రావు ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ సమక్షంలో తెరాస పార్టీలో చేరారు. ఈ సంద‌ర్భంగా నాయ‌కుల‌కు గాంధీ తెరాస కండువాలు క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

పార్టీలో చేరిన వారికి తెరాస కండువాలు క‌ప్పుతున్న ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ

అనంత‌రం ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కెసిఆర్ చేపడుతున్న అభివృద్ధి, ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై ప్ర‌జ‌లు స్వచందంగా తెరాస పార్టీలో చేరుతున్నార‌ని అన్నారు. అంద‌రం క‌లిసి బంగారు తెలంగాణ‌ను సాధించేందుకు సీఎం కేసీఆర్ నాయ‌క‌త్వంలో ముందుకు సాగాల‌ని పిలుపునిచ్చారు. ప్ర‌భుత్వ పేద‌ల కోసం ఎన్నో సంక్షేమ ప‌థ‌కాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌వేశ‌పెడుతుంద‌న్నారు. గ‌తంలో ఏ రాజ‌కీయ పార్టీ చేయ‌నంత అభివృద్ధిని తెరాస పార్టీ హ‌యాంలో శేరిలింగంప‌ల్లిలో చేప‌ట్టామ‌ని అన్నారు. ప్ర‌జ‌ల మ‌ద్ద‌కు త‌మ‌కే ఉంద‌న్నారు. పార్టీలో చేరే ప్ర‌తి ఒక్క‌రికీ స‌రైన గుర్తింపు ల‌భిస్తుంద‌ని తెలిపారు. రానున్న గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా ప‌నిచేయాల‌ని పిలుపునిచ్చారు.

పార్టీలో చేరిన నాయ‌కుల‌తో ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ

తెరాస పార్టీలో చేరిన వారిలో నాగేంద్రప్ప, నాగరాజు, శ్రీనివాస రాజు, గోపాల్, వెంకటేష్, శ్రీనివాసులు, రామ కిషోర్, అభినవ్, నారాయణ రెడ్డి, సుబ్రమణ్యం, జీవీఎస్‌ రామారావు, తిరుపతి రావు, ఈశప్ప ఉన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here