శేరిలింగంపల్లి, నవంబర్ 12 (నమస్తే శేరిలింగంపల్లి): రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో అఖిలభారత యాదవ సంఘం, పోతర్ల అంబయ్య యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా సదర్ మహోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఇందులో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, షాద్ నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అంబయ్య యాదవ్, బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, పరిగి కంటెస్టెడ్ ఎమ్మెల్యే భేరి రామచందర్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సదర్ పండుగ ఐక్యమత్యానికి చిహ్నం అని అన్నారు. యాదవులకు ప్రభుత్వాలు దామాషా పద్ధతిగా రిజర్వేషన్లు కల్పించి విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ బిజెపి నాయకుడు కటారి జంగయ్య యాదవ్, యాదవ్ సంఘం అధ్యక్షుడు బొజ్జం చంద్రయ్య యాదవ్, కర్రోళ్ల చంద్రయ్య ముదిరాజ్, కాకి కుమార్ యాదవ్, దుడ్డు కృష్ణ యాదవ్, జిల్లా నాగేష్ యాదవ్, మేకల శ్రీనివాస్ యాదవ్, మేకల సందీప్ యాదవ్, చేతారం పర్వతాలు యాదవ్, తెజ్జీరి శ్రీశైలం యాదవ్, తెజ్జీరి లక్ష్మయ్య యాదవ్, జోగోరి మల్లేష్ యాదవ్, గోవర్ధన్ యాదవ్, శ్రీశైలం యాదవ్, పర్వతాలు యాదవ్, మిద్దేటి యాదయ్య యాదవ్, ఆశన్న గారి మల్లేష్ యాదవ్, బాలయ్య యాదవ్, పోల్కం బాలయ్య యాదవ్, పాండు యాదవ్, మల్లేష్ యాదవ్, జోగోరి పర్వతాలు యాదవ్, యాదవ సంఘం పెద్దలు, యువజన నాయకులు, సంఘం సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.