- గౌలిదొడ్డిలో నిరుపేద చిన్నారులకు బ్లాంకెట్ల పంపిణీ
- సాంప్రదాయ వస్త్రధారణలో ఆకట్టుకున్న సంకల్ప చిన్నారులు

చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ సంకల్ప ఫౌండేషన్ లో బాలల దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఫౌండేషన్ లోని అనాధ చిన్నారులు సాంప్రదాయ వస్త్రధారణలో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా గౌలిదొడ్డిలోని నిరుపేదల గుడిసెల్లోని చిన్నారులకు ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు గుండ్ర రోజి ఆధ్వర్యంలో బ్లాంకెట్లు పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ బాలల దినోత్సవ వేళ నిరుపేద చిన్నారుల కళ్లల్లో ఆనందం చూడాలనే ఉద్దేశంతో, చలి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని బ్లాంకెట్లను పంపిణీ చేయడం జరిగిందన్నారు. అవసరం ఉన్నవారికి అవకాశం ఉన్నంత మేరా సహకరించేందుకు సంకల్ప ఫౌండేషన్ ముందుంటుందని అన్నారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని ఫౌండేషన్ లోని చిన్నారులు సాయం సంధ్య వేళ దీపాలు వెలిగించి సంబురాలు జరుపుకున్నారు.







