శేరిలింగంపల్లి, నవంబర్ 1 (నమస్తే శేరిలింగంపల్లి): టెలికాం అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా నియమితులైన రంగారెడ్డి అర్బన్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు బుచ్చి రెడ్డికి చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంఛార్జి రవికుమార్ యాదవ్ బీజేపీ ఇతర నాయకుల సమక్షంలో నియామక పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బుచ్చిరెడ్డి తమ విలువైన సూచనలతో టెలికాం శాఖను పటిష్ఠం చేస్తూ, వృద్ధి చెందాలని ఆకాంక్షించారు, బుచ్చిరెడ్డి మాట్లాడుతూ ఈ అవకాశం కల్పించిన ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి రవికుమార్ యాదవ్ కి ధన్యవాదాలు తెలిపారు. బాధ్యతను అప్పగించడం చాలా సంతోషంగా ఉందని, నిబద్ధతతో పని చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో రామిరెడ్డి, జితేందర్, వరప్రసాద్, శాంతి భూషణ్ రెడ్డి, సీతారామరాజు, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.