టెలికాం అడ్వైజ‌రీ క‌మిటీ స‌భ్యుడిగా బుచ్చిరెడ్డి

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 1 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): టెలికాం అడ్వైజరీ కమిటీ స‌భ్యుడిగా నియమితులైన రంగారెడ్డి అర్బన్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు బుచ్చి రెడ్డికి చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంఛార్జి రవికుమార్ యాదవ్ బీజేపీ ఇతర నాయకుల సమక్షంలో నియామక పత్రం అందజేశారు.

ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి, ర‌వికుమార్ యాద‌వ్ చేతుల మీదుగా నియామ‌క ప‌త్రం అందుకుంటున్న బుచ్చి రెడ్డి

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బుచ్చిరెడ్డి త‌మ‌ విలువైన సూచనలతో టెలికాం శాఖను పటిష్ఠం చేస్తూ, వృద్ధి చెందాలని ఆకాంక్షించారు, బుచ్చిరెడ్డి మాట్లాడుతూ ఈ అవకాశం కల్పించిన ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి రవికుమార్ యాదవ్ కి ధన్యవాదాలు తెలిపారు. బాధ్యతను అప్పగించడం చాలా సంతోషంగా ఉందని, నిబద్ధతతో పని చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో రామిరెడ్డి, జితేందర్, వరప్రసాద్, శాంతి భూషణ్ రెడ్డి, సీతారామరాజు, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here