శేరిలింగంపల్లి, నవంబర్ 1 (నమస్తే శేరిలింగంపల్లి): దీపావళి పండుగ సందర్భంగా PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ నివాసంలో జరిగిన వేడుకలలో ఆయన కుటుంబ సమేతంగా పాల్గొని తారా జువ్వలు వెలిగించారు.
ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ చీకటిని పారద్రోలి వెలుగు నిచ్చే దీపావళి పర్వదినం ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆకాక్షించారు. దీపావళి దివ్యకాంతుల వేళ అష్ట లక్ష్ములు ప్రజల గృహాలలో నెలవై ప్రజలకు సకలశుభాలను, సాహసోపేతమైన విజయాలను, సిరి సంపదలను, సుఖసంతోషాలను, సంవృద్ది, భోగభాగ్యలను ఎల్లవేళలా ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.