శేరిలింగంపల్లి, అక్టోబర్ 28 (నమస్తే శేరిలింగంపల్లి): టీడీపీ చేవెళ్ల పార్లమెంట్ కన్వీనర్ గా శేరిలింగంపల్లికి చెందిన కట్టా వెంకటేష్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పొలిట్ బ్యూరో సభ్యుడు బక్కని నరసింహులు ఆదేశాలు జారీ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తెలంగాణలో పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా అడ్ హక్ కమిటీ కన్వీనర్లను నియమించడం జరిగిందని నరసింహులు అన్నారు. టీడీపీ సభ్యత్వ నమోదుకు వీరందరూ కృషి చేయాలన్నారు.