శేరిలింగంపల్లి, అక్టోబర్ 28 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని గచ్చిబౌలి డివిజన్ పరిధిలో ఈఆర్వో (ఎలక్ట్రికల్ రెవెన్యూ ఆఫీస్)ను ఏర్పాటు చేయాలని కోరుతూ మాజీ కౌన్సిలర్, ఫ్లోర్ లీడర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ సోమవారం తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ సూపరింటెండెంట్ ఇంజినీర్ చంద్రశేఖర్ కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా తాడిబోయిన రామస్వామి యాదవ్ మాట్లాడుతూ స్థానికంగా ఈఆర్వో ఆఫీస్ లేకపోవడం వల్ల వినియోగదారులు కూకట్పల్లి వరకు వెళ్లాల్సి వస్తుందని అన్నారు. అత్యధికంగా వినియోగదారులు ఉన్నందున వెంటనే గచ్చిబౌలిలో ఈఆర్వో ఆఫీస్‌ను ఏర్పాటు చేయాలని కోరారు.