శేరిలింగంపల్లి, అక్టోబర్ 26 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్ కాలనీ వాసులు పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై PAC చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీని మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు. దీనిపై గాంధీ సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా గోకుల్ ప్లాట్స్ కాలనీ వాసులు మాట్లాడుతూ కాలనీలో అసంపూర్తిగా మిగిలిపోయిన సీసీ రోడ్లను వేయాలని, డ్రైనేజి వ్యవస్థను, మంచి నీటి వ్యవస్థను మెరుగుపర్చాలని, వీధి దీపాలను వ్యవస్థను ఏర్పాటు చేయాలని వినతి పత్రం ద్వారా కోరారు.
ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ త్వరలోనే గోకుల్ ప్లాట్స్ కాలనీలో పర్యటిస్తానని, గోకుల్ ప్లాట్స్ కాలనీలో నెలకొన్న అసంపూర్తిగా మిగిలిపోయిన రోడ్ల సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని తెలిపారు. మిగిలిన పనులను సైతం త్వరగా పూర్తి చేసేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బ్రిక్ శ్రీనివాస్, సిహెచ్ సాంబయ్య, సంజీవరెడ్డి, ప్రకాష్ రెడ్డి, ప్రభాకర్, మనోజ్, వెంకటేశ్వర రెడ్డి, దేవా, హరి ప్రకాష్, వెంకట రాంబాబు, బాలరాజు, వెంకటేశ్వరరావు, సంఘం మహేష్ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.