శేరిలింగంపల్లి, అక్టోబర్ 26 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని కృషి నగర్ కాలనీలో నూతనంగా నిర్మించి సీసీ రోడ్డు నిర్మాణ పనులను కాలనీ వాసులతో కలసి డివిజన్ కార్పొరేటర్, జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యుడు ఉప్పలపాటి శ్రీకాంత్ పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ కృషి నగర్ కాలనీలో నూతనంగా నిర్మించి సీసీ రోడ్డు నిర్మాణ పనులను కాలనీ వాసులతో కలసి పరిశీలించడం జరిగిందని, కృషి నగర్ కాలనీ అభివృద్ధికి కృషి చేస్తామని, కాలనీలో మౌళిక వసతులు కల్పించడమే ప్రధాన ద్యేయంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు చిలుకూరి శ్రీనివాస్, వంశీ కృష్ణా రెడ్డి, పాపి రెడ్డి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.