శేరిలింగంపల్లి, అక్టోబర్ 26 (నమస్తే శేరిలింగంపల్లి): మలబార్ గోల్డ్ & డైమండ్స్ తమ చందానగర్ షోరూంలో మైన్ డైమండ్స్ షోని ప్రారంభించింది. తమ షోరూంలో ప్రత్యేక వజ్రాభరణాల ప్రదర్శనను ప్రారంభించారు. ఈ డైమండ్ షో లో రోజూ ధరించే నగలు, వివాహ ఆభరణాలు, లైట్ వెయిట్ ఆభరణాలు, పురుషుల ఆభరణాలు, ప్లాటినం ఆభరణాల సముదాయాన్ని అందిస్తున్నారని నిర్వాహకులు తెలిపారు. వినియోగదారులు నచ్చిన ఆభరణాలను సొంతం చేసుకొనే విధంగా కేవలం మలబార్ గోల్డ్ & డైమండ్స్ చందానగర్ షోరూంలో 25 అక్టోబర్ నుండి 30 అక్టోబర్ 2024 వరకు ఈ డైమండ్ షో కొనసాగుతుందని తెలిపారు.
వినియోగదారులు కొనుగోలు చేయాలనుకున్న బంగారం విలువలో 10% ముందుగా చెల్లించి అడ్వాన్స్ బుకింగ్ సదుపాయాన్ని పొందవచ్చన్నారు. తద్వారా భవిష్యత్తులో పెరిగే బంగారం ధరల నుండి లబ్ది పొందవచ్చని సూచించారు. ఈ ఆఫర్ ద్వారా నగలు కొనుగోలు చేసిన వారు, బుక్ చేసిన రోజు ధర లేదా కొనుగోలు చేసిన రోజు ధర, ఏ ధర తక్కువ ఉంటే ఆ ధర చెల్లించే సదవకాశం ఉందన్నారు. ఈ డైమండ్ షో సందర్భంగా రూ.50,000 విలువైన ప్రతి కొనుగోలుపై అదనంగా బంగారాన్ని పొందవచ్చని తెలిపారు. బంగారు ఆభరణాల కొనుగోలుపై 200 మి.గ్రా బంగారు నాణెం ఉచితంగా ఇస్తున్నట్లు తెలిపారు.