శేరిలింగంపల్లి, అక్టోబర్ 6 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన నేపథ్యంలో క్యాన్సర్ పై అవగాన కోసం స్వచ్ఛంద సంస్థ గ్రేస్ ఫౌండేషన్ ఆదివారం శేరిలింగంపల్లి డివిజన్ లోని బాలయోగి స్టేడియంలో నిర్వహించిన రన్ ఫర్ గ్రేస్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర చలనచిత్ర, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పార్టీ పక్షాన శేరిలింగంపల్లి డివిజన్ కంటెస్ట్ కార్పొరేటర్ అభ్యర్థి సామ్యూల్ కార్తీక్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ క్యాన్సర్ పై విశిష్ట సేవలు అందిస్తున్న డా. చిన్న బాబును ప్రత్యేకంగా అభినందిస్తున్నామన్నారు. యువత క్రీడలపట్ల ఆసక్తిని పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్, సైబరాబాద్ జాయింట్ కమీషనర్ జోయల్ డేవిస్ తో పాటు పలువురు అంతర్జాతీయ మారథాన్ క్రీడాకారులు, వైద్యులు, సినీ తారలు పాల్గొన్నారు.