సీఎం రిలీఫ్ ఫండ్ స‌హాయం అంద‌జేత

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 6 (న‌మస్తే శేరిలింగంప‌ల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాయదుర్గంకి చెందిన మీర్ అసిఫ్ అలీఖాన్ కి అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా CMRF-LOC ద్వారా మంజూరైన రూ.1 లక్ష ఆర్థిక సహాయానికి సంబంధించిన మంజూరు పత్రాన్ని బాధిత కుటుంబానికి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ అంద‌జేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి ఆప‌ద‌లో ఉన్న పేద‌ల‌ను ఆదుకుంటుంద‌ని అన్నారు. పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి వ‌ర్గాల‌కు చెందిన వారు ఈ స‌దుపాయాన్ని ఉప‌యోగించుకోవాల‌ని సూచించారు. ఎవ‌రికి ఎలాంటి స‌మ‌స్య ఉన్నా త‌న దృష్టికి తీసుకురావాల‌ని సూచించారు. ఈ కార్యక్రమంలో గణపతి, జాకీర్ తదితరులు పాల్గొన్నారు.

సీఎం రిలీఫ్ ఫండ్ ప‌త్రాల‌ను అంద‌జేస్తున్న PAC చైర్మన్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here