శేరిలింగంపల్లి, అక్టోబర్ 5 (నమస్తే శేరిలింగంపల్లి): తెలుగు చలనచిత్ర ప్రముఖ సినీనటుడు రాజేంద్ర ప్రసాద్ కుమార్తె గాయత్రి మృతి చెందడంతో KPHB లోని వారి నివాసానికి వెళ్లి గాయత్రి పార్ధీవ దేహానికి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించి, ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు.