శేరిలింగంపల్లి, అక్టోబర్ 5 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలో బీజేపీ సభ్యత్వాలను పెద్ద ఎత్తున నమోదు చేయాలని ఆ పార్టీ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకింది గోవర్ధన్ గౌడ్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శనివారం నియోజకవర్గం పరిధిలోని గోపీనగర్లో ఆయన సొంత బూత్‌లో ఇంటింటికీ తిరుగుతూ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ప్రజలు బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలన పట్ల విసిగిపోయారని, బీజేపీకి అధికారాన్ని అప్పజెప్తారని అన్నారు. అటు కేంద్రంలో మళ్లీ మోదీ ప్రధాని అవుతారని, రాష్ట్రంలోనూ అధికారంలోకి వచ్చి డబుల్ ఇంజిన్ సర్కారును నడిపిస్తామని అన్నారు. అందుకు గాను ప్రతి నాయకుడు, కార్యకర్త ఇప్పటి నుంచే కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.