శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 26 (నమస్తే శేరిలింగంపల్లి): సీనియర్ జర్నలిస్టు ఆదినారాయణ మృతి పట్ల శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వి.జగదీశ్వర్ గౌడ్ సంతాపం వ్యక్తం చేశారు. ఆది నారాయణ శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని హఫీజ్ పేట్ డివిజన్ వినాయక నగర్ కాలనీలో నివాసం ఉంటూ తన వృత్తికి వన్నె తెచ్చిన వ్యక్తి అని, ఆయనతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, శోకతప్తులైన వారికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.