శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 26 (నమస్తే శేరిలింగంపల్లి): ఇందిర మహిళ శక్తి స్కీమ్ లో భాగంగా స్వయం సహాయక సంఘాలకు ఉపాధి అవకాశాలు కల్పించటానికి శేరిలింగంపల్లి జోన్ లో ఉన్న ప్రధాన కూడళ్లు (జంక్షన్స్) దగ్గర అలాగే పార్క్స్ లో కూడా క్యాంటీన్స్ ఏర్పాటు చేయాలని శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఇందిరా మహిళా శక్తి పాలసీ పేరుతో మహిళా పారిశ్రామికవేత్తలకు సాధికారత కల్పించడం కోసం అడిషనల్ కమిషనర్ (అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్) GHMC వారితో, జోనల్ లో అన్ని సర్కిళ్ల ప్రాజెక్టు అధికారులతో కలిసి జడ్‌సీ ఉపేందర్ రెడ్డి మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. ఆయన వెంట మీటింగ్ లో అడిషనల్ కమిషనర్ చంద్రకాంత్ రెడ్డి, ఆల్ ప్రాజెక్టు అధికారులు, డీసీ యూసఫ్ గూడ, జకీయ సుల్తానా, డీసీ శేరిలింగంపల్లి సర్కిల్ ముకుంద రెడ్డి, ఫైనాన్షియల్ అడ్వైజర్ సుధాకర్, ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ విజయ్ కుమార్, మెడికల్ ఆఫీసర్ సర్కిల్ 19 యూసఫ్ గూడ సాల్మన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.