తెలంగాణ తల్లిని, ప్రజలను కాంగ్రెస్ పార్టీ అవమానించింది: రవీందర్ యాదవ్

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 18 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): తెలంగాణ తల్లిని, ప్రజలను కాంగ్రెస్ పార్టీ అవమానించిందని భారాస సీనియర్ నేత రవీందర్ యాదవ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సచివాలయం ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టించాల్సిన చోట కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై ఆయ‌న‌ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్ లోని తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ప్రజా పాలన అంటే ప్రజల అభిప్రాయాలను పట్టించుకోకపోవడమా అని ప్ర‌శ్నించారు. రేవంత్ రెడ్డిది నియంత పాలన, కేసీఆర్ అభివృద్ధి చేస్తే దాన్ని నాశనం చేస్తుండ‌ని అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయకుండా ఆలస్యం చేసి విద్యార్థుల బలిదానాలను తీసుకున్న కాంగ్రెస్ పార్టీని చరిత్ర మరువదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతోనే ప్రజలకు కష్టాలు మొదలయ్యాయన్నారు.

తెలంగాణ త‌ల్లి విగ్ర‌హానికి పాలాభిషేకం చేస్తున్న ర‌వీంద‌ర్ యాద‌వ్

కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణను నెంబర్ గా అభివృద్ధి చేస్తే సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు దివాళా తీయించేలా పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణకు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తూ వస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ మరోసారి తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయకుండా రాజీవ్ గాంధీ విగ్రహాం ఏర్పాటు చేయడమేంటని ప్రశ్నించారు. రాజీవ్ గాంధీ విగ్రహాం ఏర్పాటు మీద ఉన్న శ్రద్ధ తెలంగాణ ప్రజల మీద లేదని ధ్వజమెత్తారు. ఢిల్లీకి గులాంలు చేస్తూ తెలంగాణ ప్రజలను అవమానిస్తున్నారన్నారు. ప్రజా పాలన అంటే ప్రజల అభిప్రాయాలను పట్టించుకోకపోవడమేనని కాంగ్రెస్ పార్టీ కొత్త అర్ధాన్ని చెబుతుందని విమర్శలు గుప్పించారు. ఈ కార్యక్రమం లో బీఆర్ఎస్ శేరిలింగంపల్లి డివిజన్ కంటెస్టెంట్ కార్పొరేటర్ మారబోయిన రవి యాదవ్, నర్సింహా రెడ్డి, సాయి చందర్, శ్రీకాంత్ యాదవ్, మల్లేష్ గౌడ్, శ్రీశెలం యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here